ఇషా చావ్లాతో తిరిగిన సుడి..

ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ నిర్మించిన ప్రేమ కావాలి చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి ఇషా చావ్లా. ఈ చిత్రం సక్సెస్‌ తర్వాత అదే బేనర్‌లో పూలరంగడు చేసి సక్సెస్‌ సాధించింది. దీంతో ఆమెను సెంటిమెంట్‌గా నిర్మాత వెంకట్‌ భావిస్తున్నట్లు తెలిసింది. 

తాము నిర్మించే చిత్రాల్లో ఇషా చావ్లానే తీసుకోవాలని దర్శకులకు చెబుతున్నాడట. అంతేగాక ఈమెకు సదరు నిర్మాత ఖరీదైన ఓ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అది ఫ్లాట్‌ కానీ ఇంకేమైనా కానీ. త్వరలో ఆ వివరాలు తెలుస్తాయని ఫిలింనగర్‌ కథనం.