ముషారఫ్‌పై ఇంటర్‌పోల్‌ నోటీసులు

ముషారఫ్‌పై ఇంటర్‌పోల్‌ నోటీసులు

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అతనిపై ఉన్న పాతకేసులన్నీ ఇప్పటికే తిరగదోడిన పాక్ సర్కార్‌.. ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు సిద్ధమైంది. ఇది పసిగట్టిన ముషారఫ్‌ కొన్నేళ్లుగా ప్రవాసంలో ఉంటున్నారు. ఈమధ్య కాలంలో ఆయన పాక్ వెళ్లాలని భావించినా పరిస్థితులు అనుకూలంగా లేవని పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ముష్‌ను అరెస్టు చేసేందుకు పాక్‌ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మాజీ ఆర్మీ చీఫ్‌పై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది.