హనుమాన్‌ విగ్రహం వద్ద చిలుక సందడి

హనుమాన్‌ విగ్రహం వద్ద చిలుక సందడి

హనుమాన్‌ విగ్రహం వద్ద ఓ రామచిలుక సందడి చేసింది. విగ్రహంపై అటు ఇటు తిరుగుతూ ఉండటంతో సాక్షాత్తు హనుమంతుడే వచ్చాడంటూ భక్తులు పూజలు, భజనలు చేశారు.

కరీంనగర్‌ జిల్లా జగిత్యాల సమీపంలోని ఈ ఆలయంలో సందడే సందడి. కారణం.. ఓ రామ చిలుక హనుమంతుడి విగ్రహంతో ముచ్చట్లాడ్డమే. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరూ చూడలేదు. కానీ.. ఉదయం వచ్చిన రామచిలుక హనుమంతుని విగ్రహం చుట్టూనే ప్రదక్షిణలు చేసింది. దీంతో.. జనం భారీగా గుమికూడారు. 

ఇదంతా దైవ మహిమగా స్థానికులు భావించారు. భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. భజనలు చేస్తూ... ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుడే లోక కళ్యాణం కోసం చిలుక రూపంలో వచ్చాడని నమ్మారు. 

శ్రీరామ నవమికి చిలుక జాతర నిర్వహించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్‌ విగ్రహం వద్ద ఉన్న చిలుకను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల వారు క్యూ కట్టారు.