'మహా'లో మావోల విధ్వంసం

 మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని గడ్చిరోలిలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో పదిహేను మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎంత మంది గాయపడ్డారో తెలియరాలేదు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు కూంబింగ్ జరుపుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సును పేల్చి వేశారు. తానూరు తహసీల్ పుచ్చోలి దగ్గర ఈ ఘటన జరిగింది. చత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోలు ఇరవై నాలుగు గంటల్లోనే మహారాష్ట్రలో మరో మందు పాతర పేల్చారు. ఈ ఘటనతో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోల విధ్వంసాన్ని హోంమంత్రి ఖండించారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు.

ఘటనా స్థలానికి అదనపు బలగాలను ప్రభుత్వం పంపించింది. గడ్చిరోలి ఆంధ్రా-ఛత్తీస్ గఢ్ సరిహద్దు. ఇక్కడ మావోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఈ పరిసరాల్లో మండల ఆఫీసుపై దాడి చేశారు. వరుస దాడులతో అక్కడ భయానక పరిస్థితి కనిపిస్తోంది.