బలిదానాలపై... వర్మ సంచలన వ్యాఖ్యలు

బలిదానాలపై... వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంశం నేపథ్యంలో పలువురు యువకులు ఆత్మ బలిదానాలు పాల్పడుతున్న తరుణంలో ఆయన తన ట్విట్టర్లో భిన్నంగా స్పందించారు. ‘‘ఆత్మహత్యలు చేసుకునే బదులు హత్యలు చేయరెందుకు?'' అంటూ ట్వీట్ చేశారు. అయితే వర్మ ఇటు తెలంగాణ జోలికి కానీ, సమైక్యాంధ్ర జోలికి కానీ పోకుండా ఈ వ్యాఖ్యలు చేయడం వెనక....కేవలం పబ్లిసిటీ స్టంటే అని అంతా చర్చించుకుంటున్నారు. ఏ సంఘటన జరిగినా తన పేరు మారుమ్రోగిపోవాలని తహతహలాడే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. మరి ఈ వ్యాఖ్యలపై ఎవరి స్పందన ఎలా ఉంటుందో..? చూడాలి. 

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో ‘డిపార్ట్ మెంట్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి, మధు శాలిని, లక్ష్మి మంచు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం మే 18న విడుదలకు సిద్ధం అవుతోంది. రాణా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మధుశాలిని లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో, మంచు లక్ష్మి సంజయ్ దత్ భార్య పాత్రలో కనిపించనుంది.