రూ.7.2 కోట్ల స్వాధీనం

లెక్కలు చూపని రూ.7.2 కోట్ల నగదును తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. చెన్నై శివారులోని థిల్లైగంగ నగర్‌లోని ఓ ఇంట్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతున్నాయని సమాచారం అందడంతో వారు దాడి చేశారు. ఆ ఇంటిలో ఉన్న నాగరాజన్ అనే లాటరీ వ్యాపారి నుంచి రూ.7.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు. ఈ డబ్బుకు సంబంధించి అతడు ఇచ్చిన వివరాలు నమ్మదగ్గవిగా లేవని పోలీసులు చెప్పారు