కోర్టుకెక్కిన సినీ నటి రంజిత

 కోర్టుకెక్కిన సినీ నటి రంజిత

రాసలీలల సీడి ప్రసారంపై సినీ నటి రంజిత కోర్టుకెక్కారు. స్వామి నిత్యానందతో తాను రాజసలీలల్లో పాల్గొన్నట్లు రంజితను చూపిస్తూ ప్రసారం చేసిన సిడీలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళ టీవీ చానెళ్లు, పత్రికలపై ఆమె కోర్టుకెక్కారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆమె సన్ టీవీ, దినకరన్, మురుసు పత్రికలపై కేసు పెట్టారు. 

బెంగళూర్‌లోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆ చానెల్, ఆ పత్రికలపై ఆమె ఫిర్యాదు చేశారు. నిత్యానందతో తాను సన్నిహితంగా ఉన్నట్లు సృష్టించిన నకిలీ చిత్రాలను చానెళ్లలో ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల నిత్యానందతో కలిసి ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో కూడా సిడీల ప్రసారంపై మాట్లాడారు. మీడియాపై నిత్యానంద ఆ సమయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.