బాలీవుడ్‌కి అల్లరి నరేష్ చిత్రం

బాలీవుడ్‌కి అల్లరి నరేష్ చిత్రం

అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ బాబుల కళ్లు పడ్డాయి. ఇంకేం... అనుకున్నదే తడువుగా ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూజా ఫిల్మ్ వారు ఈ చిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క రీమేక్ హక్కులు దక్కించుకున్నారు కూడా. జాకీ భగ్నాని ఈచిత్రంలో అల్లరి నరేష్ పాత్రలో నటించనున్నడు.

ధూమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్ గాంధీ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. సాజిద్-వాజిద్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో తెలుగులో సూర్ హిట్టయిన పోకిరి, రెడీ లాంటి చిత్రాలు బాలీవుడ్లోనూ కాసుల పంట పండించిన విషయం తెలిసిందే. మరి అల్లరి నరేష్ ఏ రేంజ్ లో సత్తా చాటు తుందో చూడాలి.

ప్రస్తుతం అల్లరి నరేష్ ‘నెలతక్కువోడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు అనిల్ సుంకర దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.