తెలుగు దర్శకుడు అనుమానస్పద మృతి

హైదరాబాద్ బల్కంపేట బీకేగూడలో ఓ సినీ దర్శకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందా డు. అతడిని ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధి జరిగింది. ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి కథనం ప్రకారం... ప్రకాశంజిల్లా గిద్దలూర్‌కు చెందిన కె.ఆర్. రత్నం (35) తన స్నేహితుడు నాగప్రసాద్‌తో కలిసి బీకేగూడలోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. భూమ(2008)అనే సినిమాకు డెరైక్టర్‌గా పని చేసిన ఇతను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఉగాది పండక్కి ఇంటికి వెళ్తున్న నాగప్రసాద్‌ను ఈనెల 23న బస్సు ఎక్కించి వచ్చిన రత్నం.. అప్పటి నుంచి తన గది నుంచి బయటకు రావడంలేదు. అయితే, ఇతని గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని తలుపు తట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

పోలీసులు తలుపులను తెరిచి చూడగా రత్నం మృతి చెంది ఉన్నాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీంతో నాలుగు రోజుల క్రితమే ఇతను చనిపోయి ఉంటాడని, ఎవరైనా హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వారు ఎక్కడ ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడికి ఎవరితోనైనా వివాహేతర సంబంధం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. స్నేహితుడు నాగప్రసాద్ నగరానికి వచ్చాక కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉందంటున్నారు. ఇక భూమ చిత్రం నటులు రామకృష్ణ, గీతాంజలిల కుమారుడు అదిత్ శ్రీనివాస్, నవనీత్కౌర్ హీరోహీరోయిన్లుగా రూపొందింది.