'ఈ రోజుల్లో' శాటిలైట్ రైట్స్ రేటు?

'ఈ రోజుల్లో' శాటిలైట్ రైట్స్ రేటు?

మొన్న శుక్రవారం ఉగాది రోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం ‘ఈ రోజుల్లో'. నేటి తరం అబ్బాయిలు, అమ్మాయిల మనస్తత్వాల్ని, ఆలోచనా ధోరణుల్ని ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది అని తెలుస్తోంది. అయితే పాతిక లక్షలుకు ధర్ట్ పార్టీ వారు తీసుకున్నట్లు ఓ వర్గ కథనం. అదేమీ కాదు మా టీవీ వారే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని మంచి రేటు ఇచ్చి తీసుకున్నారని కొందరు అంటున్నారు. ఏదైమైనా ఈ చిత్రం విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు, దర్శకులకు మంచి కిక్ ఇచ్చింది. గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శ్రీ, రేష్మా నాయకానాయికలుగా నటించారు. ఈ రోజుల్లోని యువతరం సైకాలజీ స్టడీలా వుంటుందీ చిత్రం. 

డబ్బులుంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారని, అమ్మాయిలంతా కమర్షియల్ అయిపోయారని బలంగా విశ్వసించే మనస్తత్వంతో ఈ సినిమా హీరో పాత్ర వుంటుంది. అదే సమయంలో అబ్బాయిల స్నేహంలో నిజాయితీ వుండదని, వారు అమ్మాయిల పట్ల ఎక్కువగా శారీరక ఆకర్షణనే పెంచుకుంటారని భావించే మనస్తత్వాన్ని కలిగిన పాత్ర కథానాయికది. ఇలా భిన్న ధృవాలుగా వున్న వీరిద్దరి జీవిత ప్రయాణమే ‘ఈ రోజుల్లో' చిత్ర కథ.