సిల్క్‌స్మిత పాత్రలో బొమ్మాళి?

సిల్క్‌స్మిత పాత్రలో బొమ్మాళి?

బొమ్మాళిగా పవర్ ఫుల్ పాత్రలో, అమలాపురం సరోజగా వేశ్య పాత్రలో....అద్భుతమైన నటన కనబర్చిన నటి అనుష్క త్వరలో సిల్క్ స్మిత పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోయనుందనే వార్తలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయ్యాయి. ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ మూవీ ‘డర్టీపిక్చర్' దక్షిణాది భాషల్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికిగాను అనుష్కను విద్యాబాలన్ పోషించి సిల్క్ స్మిత పాత్రకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.

విద్యాబాలన్ నటించిన డర్టీపిక్చర్ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇప్పటికే విడుదలైంది. అందులో విద్యాబాలన్ అంగాంగ ప్రదర్శన చేసి, మంచి నటన కనబరిచినా ఆ చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అంతగా రీచ్ కాలేదు. అందుకే ఈ చిత్రాన్ని ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించే హీరోయిన్‌తో రీమేక్ చేసి ఇక్కడ కూడా కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నారు నిర్మాతలు.