గోమూత్రం ధర లీటరకు రూ. 140

 గోమూత్రం ధర లీటరకు రూ. 140

 దేశీ గోవుల ఉత్సవం ఆవుల మూత్రం లీటరుకు 140 రూపాయల చొప్పున అమ్ముడైంది. అవు మూత్రంలో ఔషధ లక్షణాలుంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. దీంతో దాని ధర అంతగా పలికినట్లు చెబుతున్నారు. గురువారం గోవుల ఉత్సవంలో పుంగనూరు పశువులు ఆకర్షణగా నిలిచాయి. ఆయుర్వేద వైద్యుల ప్రకారం - గోమూత్రంలో మూత్ర పిండాలను, రక్తనాళాలను శుద్ధి చేసే ఔషధ గుణాలుంటాయి. ఎర్ర రక్తకణాలను, హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణ ప్రక్రియను పెంచుతాయి. అయితే, వైద్యుల సలహా మేరకు గోమూత్రను తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.