ఆచార్య బెయిల్ రద్దు చేసిన హైకోర్టు

 ఆచార్య బెయిల్ రద్దు చేసిన హైకోర్టు

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టు అయిన రాష్ట్ర హోం శాఖ సీనియర్ ఐపీఎస్ అధికారి బీపీ ఆచార్య బెయిల్ పిటీషన్‌ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో సీఆర్పీసీ 306 ప్రకారం అసలు బెయిల్ ఇవ్వకూడదని, ఇచ్చే అధికారం సీబీఐ కోర్టుకు కూడా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. తక్షణమే సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. 

ప్రాసిక్యూషన్‌కు అనుమతించనంత మాత్రాన బెయిల్ ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులకు ఇలా బెయిల్ మంజూరు చేస్తూపోతే దర్యాప్తు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని కోర్టు మండిపడింది. 

ఇదిలావుండగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కోనేరు రాజేంద్ర ప్రసాద్ హైకోర్టులో చుక్కుదురైంది. బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. కోనేరు రాజేంద్ర ప్రసాద్ గతంలో రెండుసార్లు సీబీఐ కోర్టులో దాఖలు చేసుకోగా తిరస్కరణకు గురైన విషయం తెల్సిందే.