ధరలు పెరగడానికి చైనా, భారత్‌లే కారణం

 ధరలు పెరగడానికి చైనా, భారత్‌లే కారణం

భారత్, చైనా, బ్రెజిల్ దేశాల్లో పెరిగిపోతున్న డిమాండ్‌ కారణంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. అధిక జనాభాతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిమాండ్ పెరుగుతున్న కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోమారు హెచ్చరించారు. 

2010 లో ఒక్క చైనాలో మాత్రమే కోటి కొత్తకార్లు రోడ్లపైకి వచ్చాయని, ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి అది కారణమవుతోందని ఒబామా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వందేళ్లకు సరిపడా సహజవాయువును అభివృద్ది చేస్తున్నామని, దీనివల్ల రాబోయే పదేళ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఒబామా అన్నారు.