రజనీ 'కొచ్చాడియాన్' రైట్స్‌

రజనీ 'కొచ్చాడియాన్' రైట్స్‌

రజనీకాంత్‌ తాజా సినిమా 'కొచ్చాడియాన్‌'. 150 కోట్లతో భారీగా తీస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్‌ వాల్యూస్‌ హైలైట్‌గా నిలుస్తాయి. రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పడుకొనే రజనీకాంత్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. 

ప్రతిస్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులు లక్ష్మీగణపతి ఫిలిమ్స్ సంస్థ సొంతం చేసుకుంది. 'అవతార్‌' చిత్రం తర్వాత ఇండియాలో పెర్‌ఫార్మెన్స్‌ మోషన్స్, టెక్నాలజీతో ఈ చిత్రం రాబోతుందని ఆయన తెలిపారు. 3డిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రెహ్మాన్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ఆది, శరత్‌కుమార్, జాకీష్రాఫ్‌ తదితరులు నటిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలుపుతానని నిర్మాత సుబ్రమణ్యం తెలిపారు.