లాడెన్ భార్యలపై కేసు: పాకిస్థాన్ ఆర్మీ!!

లాడెన్ భార్యలపై కేసు: పాకిస్థాన్ ఆర్మీ!!


అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు దివంగత ఒసామా బిన్ లాడెన్ భార్యలపై పాకిస్థాన్ ఆర్మీ ఓ కేసు నమోదు చేసింది. వీరు చట్ట వ్యతిరేకంగా దేశంలో నివశిస్తూ వచ్చినట్టు వారిపై నిందలు మోపి, ఈ కేసును నమోదు చేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు. 

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఒసామా ముగ్గురు భార్యలు, వారి పిల్లలు తగిన వీసా లేకుండా పాకిస్థాన్‌‍లో నివసిస్తున్నందుకుగాను వారిపై కేసు నమోదు చేసినట్టు, దీనిపై విచారణ జరుగుతోందని కూడా ఆయన చెప్పారు.

ఇదిలావుండగా, పదవీ విరమణ పొందిన పాకిస్థాన్ సైనికాధికారి షౌకాత్ ఖాదిర్.. లాడెన్ చివరి గడియలపై స్పందిస్తూ... లాడెన్‌కు ముగ్గురు భార్యలుండగా, వీరిలో ఇద్దరు భార్యలతో కలిసి లాడెన్ అబొట్టాబాద్‌లోని నివాసంలో నివశిస్తూ వచ్చాడని చెప్పారు. లాడెన్ తన మూడో భార్యతో మొదటి అంతస్తులో ఉండగా, మొదటి భార్యను కూడా అదే గృహంలో కింది అంతస్తులో నివశిస్తూ వచ్చేవారని తెలిపారు. 

అమెరికా గూఢచారులకి లాడెన్ మా ఆచూకీ చెప్పి పట్టించింది అతని మొదటి భార్యేనని అమల్ సదా పాకిస్థాన్‌లో జరిగిన ఒక విచారణ సమయంలో వెల్లడించింది. అంతేకాకుండా తన భర్త లాడెన్ 2002వ సంవత్సరంలో కిడ్నీమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు ఆయన తెలిపారు.