ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో పవన్ కళ్యాణ్!?

ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో పవన్ కళ్యాణ్!?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీ అయిపోతున్నారు. తాజాగా అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒకే ఒక్కడు సీక్వెల్ లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాసముందని సమాచారం. అందుకు గానూ శంకర్ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో తెలుగు,తమిళ భాషల్లో భారీగా ఈ చిత్రం రూపొందించి హిట్ కొట్టాలని శంకర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. 

దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు ఈ చిత్రంలో చర్చించనున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. సినిమా పూర్తిగా దేశ రక్షణదళంలో పేరుకుపోయిన అవినీతి చుట్టూ తిరుగబోతున్నట్లుగా చెప్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ పూరీ జగన్నాథ్‌ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'కి డేట్స్ కేటాయించారు. మరో ప్రక్క గబ్బర్ సింగ్ ప్రమోషన్ కి ప్లానింగ్ లో ఉన్నారు. శంకర్ ..విజయ్ తో తెరకెక్కించిన త్రీ ఇడియట్స్ రీమేక్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవటంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు.