హన్సిక డబుల్ మీనింగ్ డైలాగులు

హన్సిక డబుల్ మీనింగ్ డైలాగులు

తెల్లతోలు ఉంటే చాలు తెగ అభిమానించే తమిళ తంబీలు హీరోయిన్ హన్సికను ఇప్పుడు టాప్ రేంజికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఒరు కల్ ఒరు కన్నాడి' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఎం. రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో పాత్రకు తగిన విధంగా స్క్రిప్టులో భాగంగా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని దర్శకుడు హన్సికకు చెప్పిమరీ ఒప్పించాడు. రేపు సినిమా విడుదలయ్యాక నాతో అలాంటి డైలాగులు చెప్పించారా? అని హన్సిక బాధ పడకుండా ఆ డబల్ మీనింగ్ అర్థం ఏమిటో కూడా విడమరిచి చెప్పాడట దర్శకుడు. 

దీంతో ఈ డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తాయనే ప్రచారం మొదలైంది తమిళ సినీ వర్గాల్లో. ఇదే విషయమై హన్సిక మీడియాతో మాట్లాడుతూ మీరు విన్న వార్తలు నిజమే కానీ...అందులో పూర్తి వాస్తవం లేదంటోంది. అలాంటి డైలాగులు ఉన్నప్పటికీ కుటుంబ సమేతంగా చూసేలా సినిమా ఉంటుంది, నాలో కొత్త కోణాన్ని చూస్తారు అని చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం హన్సిక తెలుగులోనూ ఓ సినిమాకు కమిట్ అయింది. మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ‘దొరకడు' అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయింది.