అందుకు పశ్చాత్తాపపడ్డాను: జూ.ఎన్టీఆర్

అందుకు పశ్చాత్తాపపడ్డాను: జూ.ఎన్టీఆర్

మొదట బోయపాటి ‘భద్ర' కథతో నా దగ్గరకు వచ్చాడు. ఆ కథ నాకప్పుడు అంత నచ్చలేదు. కానీ సినిమా చూశాక ‘భద్ర'లాంటి సినిమాని ఎందుకు వదులుకున్నానా? అని పశ్చాత్తాపపడ్డాను అన్నారు ఎన్టీఆర్. గురువారం రాత్రి జరిగిన దమ్ము ఆడియో పంక్షన్ లో ఆయన ఇలా స్పందించారు. అలాగే కేయస్ రామారావుగారు పదేళ్ల క్రితం నాకో మాట చెప్పారు. 

హీరోల చుట్టూ తిరగడం నాకలవాటు లేదు. ఏదైనా ఒక హీరోనే నమ్ముకుంటాను. నేను మళ్లీ తీస్తే మీతోనే సినిమా చేస్తాను అని. ఈ పదేళ్లల్లో బోయపాటి గురించే ఎక్కువగా చెప్పేవారు. ‘సింహా' సినిమా చూసి షాక్ అయ్యాను. ఇలా కూడా సినిమా తీయొచ్చా అనుకున్నాను. అదేరోజు కేయస్ రామారావుగారికి ఫోన్ చేసి, మన డెరైక్టర్ బోయపాటి శ్రీను అన్నాను. నాతో సినిమా కోసం తొమ్మిది కథలు చెప్పాడు. వేరే దర్శకుడు అయ్యుంటే మాత్రం నా కాంపౌండ్‌లో కనిపించేవాడే కాదు. అభిమానుల్ని మెప్పించాలంటే ఇంకా ఏదైనా కొత్తగా కావాలని చెప్పాను. 

అప్పుడు పదోసారి ఓ లైన్‌ చెప్పాడు. అదే ఈ చిత్రం. ఇక ప్రేక్షకుల్ని మెప్పించాలంటే దమ్ముండాలి. దర్శకుడు బోయపాటి శ్రీను పదోసారి అలాంటి దమ్మున్న కథను వినిపించాడు. ఈ చిత్రంలో నటించడం నా అదృష్టం అన్నారు ఎన్టీఆర్‌. ఇక ఇళయరాజా తర్వాత ఆ స్థాయిలో నాకు నచ్చిన సంగీత దర్శకుడు కీరవాణి. ఆయన స్వరపరిచిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాట వినందే నేను నిద్రపోను. మా ఆవిడకి కూడా ఆ పాట నేర్పించాను. 'దమ్ము'తో దుమ్ముదులిపే పాటలిచ్చారని చెప్పుకొచ్చారు.