పవన్ కళ్యాణ్ పై పోటీకి సై అంటున్న రాజమౌళి

పవన్ కళ్యాణ్ పై పోటీకి సై అంటున్న రాజమౌళి

పవన్ కళ్యాణ్ లాంటి మెగా హీరో చిత్రం విడుదల అంటే ఆ చిత్రం రిలీజుకు ముందు వెనక కొద్ది రోజుల పాటు వేరే సినిమా విడుదల చేయటానికి చాలా మంది వెనక అడుగు వేస్తారు. అయితే రాజమౌళి మాత్రం అటువంటిదేమీ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. ఆయన పవన్ గబ్బర్ సింగ్ విడుదల రెండు రోజుల గ్యాప్ లో తన ఈగని వదలటానకి సిద్దపడుతున్నట్లు సమాచారం. 

పవన్ గబ్బర్ సింగ్ మే 9న విడుదల ప్లాన్ చేస్తూంటే మే 11 న ఈగ వస్తోంది. మొదటి ఈగను ఏప్రియల్ లో రిలీజ్ అనుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ లో లేటు వల్ల మే 11 కి వెళ్లింది. అయితే ఈ విషయమై ఇంకా రాజమౌళి అఫీషియల్ ప్రకటన చెయ్యలేదు. ఈ నెల 30 న జరిగే ఆడియో పంక్షన్ విడుదల తర్వాత రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాసం ఉంది. ఇక రెండు చిత్రాలు దేనికి తగినట్లు దానకి క్రేజ్ తెచ్చుకున్నాయి. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు పై ఎలా నమ్మకం ఉందో,అలాగే పవన్ చిత్రం గబ్బర్ సింగ్ కూడా గ్యారెంటీ హిట్ అన్నట్లుగా వాతావరణం కనపడుతోంది. ఈ పోటి ధియోటర్స్ విషయంలో ఇబ్బంది పెడుతుందా అనేది ఒకటే ఇండస్ట్రీ వర్గాల్లో ఆలోచనగా ఉంది.