అల్లుడికి గిఫ్టు ఇచ్చిన చెర్రీ మామ

అల్లుడికి గిఫ్టు ఇచ్చిన చెర్రీ మామ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని చెర్రీకి కాబోయే మామ అదిరిపోయే గిఫ్టు ఇచ్చాడు. అల్లుడి కోసం ప్రత్యేకగా ఎంపిక చేసిన ఖరీదైన మేలుజాతి తెల్లగుర్రాన్ని బహుమతిగా తెచ్చాడు. ఈ గుర్రం ఖరీదు దాదాపు కోటి రూపాయలకు చేరువలో ఉంటుందని అంచనా. ఈ గిఫ్టును చూడగానే చెర్రీ చాలా సంతోష పడ్డాడట. ఎందుకంటే చెర్రీకి గుర్రాలన్నా, గుర్రపు స్వారీ అన్నా మహా ఇష్టం. ఈ హీరో ఇష్ట పడే ఆట కూడా గుర్రంపై సవారీ చేస్తూ ఆడే పోలో ఆటనే. చెర్రీకి సొంతంగా పోలోటీం కూడా ఉంది. ఇక పోతే ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న చెర్రీ-ఉపాసన జూన్ 13న మూడు ముళ్లతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి తర్వాత హనీ మూన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారట. 

ఆ సంగతి పక్కన పెడితే....చరణ్ త్వరలో రచ్చ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. చెర్రీ సరసన తమన్నా రొమాన్స్ చేస్తోంది. చిరంజీవి సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే' పాట సినిమాకు హైలెట్ గా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన రచ్చ ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.