దానికి కారణం... రాజమౌళి గారే: సమంత

దానికి కారణం... రాజమౌళి గారే: సమంత

''సెట్లో వాతావరణం హెల్దీగా ఉంటే మా పని తేలిక అవుతుంది. ఈ విషయంలో దర్శకులు రాజమౌళికి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. 'ఈగ' షూటింగ్‌ అంతా చాలా ఉత్సాహంగా గడిచిపోయింది. 'ఇంకో టేక్‌ చేద్దామా' అని ఎప్పుడు అడిగినా మేమంతా సిద్ధంగా ఉండేవాళ్లం. దానికి కారణం... రాజమౌళి గారే'' అని చెప్పుకొచ్చింది సమంత. ఈగ ఆడియో ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే... పనిలోనే ఆనందం ఉంది అనే మాటను నేను నమ్ముతాను. ఇష్టపడి పనిచేస్తే అలసట తెలీదు. నటించడం చాలా తేలికైన విషయం. అయితే మనం నటిస్తున్నామనే విషయం చూస్తున్నవారికి తెలియకూడదు. ఆ కిటుకేంటో తెలుసుకొంటే ప్రేక్షకుల్ని సులువుగా మెప్పించవచ్చు. నాక్కూడా ఆ కిటుకు తెలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. 

ఇక ప్రస్తుతం సమంత..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ సరసన చేస్తోంది. అలాగే సిద్దార్ద సరసన బెల్లంకొండ సురేష్ నిర్మాతగా నందినీ రెడ్డి దర్శకత్వంలో చేస్తోంది. మరో ప్రక్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎటో వెళ్లి పోయింది మనస్సు లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. వీటితో పాటు రామ్ చరణ్ తేజ సరసన ఎవడు చిత్రం, మణిరత్నం దర్శకత్వం లో రూపొందే కడల్ చిత్రం కమిటైంది.