గాలి నుంచి నాకు ప్రాణ భయం ఉంది: తపాల గణేష్

గాలి నుంచి నాకు ప్రాణ భయం ఉంది: తపాల గణేష్

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నుంచి తనకు ప్రాణభయం ఉందని, తనను హత్య చేసేందుకు గాలి జనార్దన్ రెడ్డి కుట్ర చేశారని గనుల యజమాని తపాల గణేష్ ఆరోపించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు ఖైదీలతో కలిసి తనను చంపేందుకు పథకం రూపొందిస్తున్నారనే అనుమానం కలుగుతోందని గణేశ్ చెప్పారు. బళ్లారిలోని తమ ఆప్తులు కొంతమంది బయటకు వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి నిన్ను వదలడని హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. తెలిపారు.

గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు హొస్పేటకు చెందిన కారంపూడి మహేష్, స్వస్తిక్ నాగరాజు 2010 మార్చి 29న తనపై దాడిచేశారని, గురువారంతో ఆ దాడి జరిగి రెండేళ్లవుతోందని ఆయన చెప్పారు. అయితే, నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదని చెప్పారు. దీంతో ఇప్పుడు తాను జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.