ప్రభుదేవాతో నయనతార సర్దుకు పోతుందా?

ప్రభుదేవాతో నయనతార సర్దుకు పోతుందా?

నయనతార, ప్రభుదేవాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నారా? ఇంత కాలం జరిగిన గొడవలను మరిచి పోయి మళ్లీ సర్దుకు పోవడానికి సిద్దం అవుతున్నారా? వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది తమిళ సినీ వర్గాల నుంచి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఇద్దరిని కలిపేందుకు నటి కుష్భూ, ప్రకాష్ రాజ్ మధ్య వర్తిత్వం కొనసాగిస్తున్నారని అంటున్నారు. చిన్న గొడవను ఇద్దరు తెగేదాకా లాగి దూరమయ్యారని, మళ్లీ వీరు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మధ్యవర్తుల ప్రయత్నం సక్సెస్ అయితే త్వరలోనే ప్రభుదేవా, నయనతార ఒక్కటయి పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదే విషయమై కుష్భూను ప్రశ్నిస్తే మీడియా ఎటూ అర్థం కాని సమాధానం ఇస్తోంది. అలాంటిదేమీ లేదనీ, అది వారి వ్యక్తిగత వ్యవహారమనీ చెప్పింది. ఒకవేళ తాను అలాంటి పని చేస్తున్నా, మీడియాకు ఎలా చెబుతానని నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. కుష్భూ మాటలను బట్టి ఆమె మధ్యవర్తిత్వం నిజమే అనే వాదనకు బలం చేకూరుస్తోంది.

అయితే నయనతార బంధువులు మాత్రం ప్రభుదేవా మోసగాడు, మళ్లీ అతనితో కలిపి నయన జీవితం నాశనం కానివ్వం అంటున్నారు. నయనతార ప్రభుదేవాకు కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం చేసిందని, డబ్బు మనిషిగా మారిన ప్రభుదేవా ఆమె ప్రేమను అర్ధం చేసుకోలేదని వారు అంటున్నారు.