వైయస్ జగన్ పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ

వైయస్ జగన్ పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ

గత ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ శానససభ్యుడు వంగవీటి రాధాకృష్ణ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆయన శుక్రవారం రాత్రి వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్‌ను ఆయన కలిసి తన అభిమతాన్ని తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు కుమారుడు జక్కంపూడి రాజా, సోదరుడు చిన్ని, సుంకర చిన్న తదితరులతో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. 

ప్రత్తిపాడు మాజీ శానససభ్యుడు మేకతోటి సుచరిత నివాసంలో ఆయన దాదాపు గంట పాటు జగన్‌తో మంతనాలు జరిపారు. త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని వంగవీటి రాధా మీడియా ప్రతినిధులతో చెప్పారు. తొలుత కాంగ్రెసు పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి ఆయన చాలా కాలం రాజకీయాలతో అంటీముంటనట్లుగా వ్యవహరించారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ విషయాన్ని ఆయన ఇప్పుడు ధ్రువీకరించా