అందానికి అందం చేకూర్చే తిలకం బొట్టు!

మహిళల ముఖానికి అందం చేకూర్చేది.. తిలకమే. ముఖానికి ఆకర్షణ ఇచ్చేది నుదుటిపై పెట్టే బొట్టే. పూర్వం మహిళలు పెట్టే కుంకుమ బొట్టు అందమే వేరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారు ముఖానికి తగ్గట్టు బొట్టు పెట్టుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. సైన్స్ పరిశోధన పరంగా జ్ఞాపకశక్తికి, ఆలోచనా శక్తి, ప్రతిభకు కీలక స్థానం నుదుటికే చెందుతుంది. 

యోగా ప్రకారం దీన్ని అగ్నా చక్రం అంటారు. ఎలక్ట్రా మాగ్నటిక్ అనే విద్యుత్ తరంగాలు మన శరీరంలో శక్తిని వెలువరిస్తాయి. అందులో నుదురు, నుదుట బొట్ట రెండూ అణువిద్యుత్ తరంగాలను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుచేతనే మనలో శోకం అధికమైనప్పుడు, తలనొప్పి రావడం గమనించవచ్చు. 

నుదుటిపై పెట్టే తిలకం ఆ ప్రాంతాన్ని చల్లారుస్తుంది. మన శరీరంలో నుంచి శక్తి వెలువడాన్ని తగ్గిస్తుంది. అందుచేత మహిళలు ఎప్పుడూ నుదుటిపై తిలకం లేకుండా ఉండకూడదట. ఇక ప్రస్తుత జనరేషన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత మహిళలు స్టిక్కర్లు బొట్లకు అలవాటు పడ్డారు. అయితే ముఖానికి తగ్గట్లు స్టిక్కర్లు ఎంపిక చేయాలని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు. 

నిలువు బొట్టు 
గుండ్రని ముఖం కలిగిన వారు నిలువు బొట్టును వాడాలి. నిలువు అధికంగా ఉండే బొట్ల ద్వారా గుండ్రపు ముఖం కలిగిన వారికి ప్రత్యేక అందం చేకూరుతుంది. వీళ్లు నిలువు బొట్టును కనుబొమ్మలకు మధ్యలో పెట్టుకోవాలి. 

హార్ట్ షేప్ ముఖం 
హార్ట్ షేప్ ముఖం కలిగిన వారు కుంకుమతో పెట్టుకునే బొట్టుతో అందంగా కనిపిస్తారు. స్టిక్కర్ బొట్లలో తక్కువ నిలువు బొట్లను వాడితే ఆకర్షణగా ఉంటుంది.

గుండ్రపు బొట్టు 
ఓవల్ ఆకారంలో ముఖం కలిగిన మహిళలు ఐబ్రోస్‌కు కాస్త పైన నుదుటిపై గుండ్రపు బొట్టును పెట్టడం మంచిదే. చదురపు కలిగిన మహిళలు గుండ్రపు బొట్లు పెట్టుకోవచ్చు. 

త్రికోణ స్టిక్కర్లు 
ముక్కోణపు ముఖం కలిగిన మహిళలకు అన్నీ రకాల బొట్లు అతుకుతాయి. నుదురు అందంగా ఉంటే నిలువు బొట్లు ఉపయోగించవచ్చు. ట్రై-యాంగిల్ బొట్లు కూడా వీరికి కలిసొస్తాయి.