జూ ఎన్టీఆర్ ‘దమ్ము' తేలేది నేడే...!

జూ ఎన్టీఆర్ ‘దమ్ము' తేలేది నేడే...!

తెలుగు సినిమాకు పాటలే ప్రాణం. ఆడియో హిట్టయితే సినిమా సంగం హిట్టయినట్లే భావిస్తుంటారు. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడంలో, వారిని థియేటర్లకు రప్పించడంలో ఆడియోదే కీలక పాత్ర. అందుకే ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్‌గా ఆడియో వేడుకలు నిర్వహిస్తుంటారు. జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము' చిత్రం ఆడియో ఈ రోజువు విడుదలవుతోంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ రోజు సాయంత్రం ఆడియో వేడుక జరుగనుంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ ఫంక్షన్‌కు సినీ పరిశ్రమలోని పలువురు బిగ్ షాట్స్ హాజరు కానున్నారు. అభిమానులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక రొమాన్స్ చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు, భాను ప్రియ, శుభలేఖ సుధాకర్, వేణు తొట్టెంపూడి, అభినయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.