అక్కినేని కుటుంబ హీరో మృతి

అక్కినేని కుటుంబ హీరో మృతి

అక్కినేని కుటుంబానికి చెందిన హీరో చరణ్ రెడ్డి గుండె పోటుతో సోమవారం మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ భర్త అయిన చరణ్ రెడ్డి గత కొంత కాలంగా హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చరణ్ రెడ్డి గతంలో హీరోయిన్ శ్రియతో కలిసి ‘ఇష్టం' సినిమాలో హీరోగా నటించాడు. హీరో సుమంత్‌కి చెల్లెలు అయిన సుప్రియ గతంలో పవన్ కళ్యాన్‌తో కలసి ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' చిత్రంలో నటించింది. ఈ ఇద్దరు దంపతులు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. చరణ్ రెడ్డి ఏడాది క్రితమే సుప్రియతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.