‘శ్రీరామ రాజ్యం'కు 18 అవార్డులు

‘శ్రీరామ రాజ్యం'కు 18 అవార్డులు

భరతముని ఆర్ట్స్ అకాడమి 25వ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మే 13న నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రొమ్మాల మునికృష్ణారెడ్డి తెలిపారు. 2011 సంవత్సరంలో తెలుగులో విడుదలైన చిత్రాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. అకాడమి సలహాదారు అంబిక కృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలను తెలుపుతూ...ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం, ఉత్తమ సందేశాత్మక చిత్రంగా రాజన్న, ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా గంగ పుత్రులు, ఉత్తమ హాస్య చిత్రంగా బ్రహ్మిగాడి కథ, ఉత్తమ శతాబ్ది నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు, ఉత్తమ దర్శకుడిగా బాపు, ఉత్తమ నటుడిగా బాలకృష్ణ, ఉత్తమ నటిగా నయనతార, ఉత్తమ హాస్య నటుడుగా బ్రహ్మానందం, ఉత్తమ సహాయ నటుడిగా శ్రీకాంత్, ఉత్తమ గాయకుడిగా ఎస్.పి బాలు తదితరులను ఎంపిక చేసినట్లు తెలిపారు. 

ఈ భరతముని అకాడమీ అవార్డుల్లో శ్రీరామ రాజ్యం సినిమాకు వివిధ కేటగిరీల్లో 18 అవార్డులు సొంతం చేసుకోవడం గమనార్హం. రాజన్న సినిమా 7 కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది. అవార్డుల కమిటీ చైర్మన్‌గా పివి. నాయుడు(రిటైర్డ్ ఐపీఎస్), అంబిక కృష్ణ, మండలీక సీతా రాఘవరావు, యం.వి బ్రదర్స్ వ్యవహరించారు.