టార్చర్ పెడుతున్న బ్రహ్మానందం?

 టార్చర్ పెడుతున్న బ్రహ్మానందం?

హాస్య నటుడు బ్రహ్మానందం గత కొంత కాలంగా కృష్ణవంశీని నానా రకాలుగా టార్చర్ పెడుతున్నాడని ఫిల్మ్ నగర్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.. అయితే ఆ టార్చర్ కేవలం తన కొడుకు గౌతమ్ ని హీరోగా పెట్టి సినిమా చెయ్యమని అని చెప్తున్నారు. పల్లకీలో పెళ్లి కూతురు చిత్రంతో పరిచయమైన గౌతమ్ కి ఇప్పటివరకూ ఒక్క హిట్టు కూడా పడలేదు. దాంతో గౌతమ్ కి ఎలాగైనా హిట్ ఇచ్చే డైరక్టర్ కోసం బ్రహ్మానందం అన్వేషించి, కృష్ణవంశీ అయితే కరెక్టుగా.. హిట్టు ఇవ్వగలడని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగా కృష్ణవంశీ ని కలిసి ప్రపోజల్ పెట్టాడు. గౌతమ్ కూడా కృష్ణవంశీ డైరక్షన్ అంటే చాలా ఆసక్తి చూపిస్తున్నాడని చెప్తున్నారు. దానికి కృష్ణవంశీ కర్ర విరగకూడదు... పాము చావకూడదు అన్నట్లుగా తప్పని సరిగా చేద్దాం అని చెప్పాడట. 

దాంతో అప్పటినుంచీ బ్రహ్మానందం వీర లెవిల్లో ఎప్పుడు చేద్దాం.. ఎప్పుడు చేద్దాం అని కృష్ణవంశీకి పోన్స్ చేస్తున్నాడట. అంతేగాక ఎక్కడైనా కనిపిస్తే మొదట అదే టాపిక్ తెస్తున్నాడు. దానితో అసలే ప్లాప్ లో ఉన్న కృష్ణవంశీ ఈ కొత్త టార్చర్ ఏంటిరా అన్నట్లు తల పట్టుకుకూర్చున్నట్లుగా రూమర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక శ్రీను వైట్ల సినిమాల ద్వారా సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన బ్ర్హహ్మానందం లేకుండా ఇప్పుడు తెలుగులో ఒక్క పెద్ద సినిమా కూడా మొదలవ్వటం లేదు.