వ్యాపారి ఆత్మహత్య

హైదరాబాద్: హీరో గోపిచంద్‌తో తన కూతురు వివాహం రద్దు కావడంతో హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌కు చెందిన వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుగు టీవీ చానెళ్లు ఆదివారం రాత్రి వార్తాకథనాలను ప్రసారం చేశాయి. టీవీ చానెళ్ల వార్తాకథనాల ప్రకారం - రాంబాబు ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడని, దాంతో అతన్ని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆతను రాత్రి 9 గంటల ప్రాంతంలో మరణించాడు. 

గోపిచంద్‌తో రాంబాబు కూతురు హరిత నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ నెల 24వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. రాంబాబు బంధువులకు, మిత్రులకు శుభలేఖలు కూడా పంచి పెట్టాడు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల తాను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు గోపిచంద్ రాంబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాంబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. అమ్మాయి హరిత విదేశాల్లో ఎంబిఎ చదివినట్లు తెలుస్తోంది.