చెక్కులకు ఇక మూడు నెలలే గడువు

AA
మీ దగ్గర మూడు నెలలు దాటిన చెక్కులు ఉన్నాయా..? అయితే వెంటనే వాటిని డబ్బుగా మార్చుకోండి. ఏప్రిల్ ఒకటి దాటితే మాత్రం ఒక్క పైసా రాదు. ఎందుకంటారా.? RBI బ్యాంకులకు కొత్తగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం చెక్కులు, డ్రాఫ్టులు, పే ఆర్డర్లను మూడు నెలల్లో నగదుగా మార్చుకోవాలి. 

ఆ గడువు దాటితే మాత్రం అవి చెల్లవు. ఈ రూల్‌ను వచ్చే నెల నుంచి కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్డర్ పాస్ చేసింది. చెక్కులవంటి వాటిని నగదు రూపంలో చలామణి చేయడాన్ని అరికట్టడానికే ఈ నిబంధనను తీసుకొచ్చినట్టు 
తెలుస్తోంది.