హర్ట్ చేస్తోన్న కలర్స్ స్వాతి

 హర్ట్ చేస్తోన్న కలర్స్ స్వాతి

నా బలహీనత గురించి చెప్పాలంటే... నాకు కొంచెం నోటి దురుసు ఎక్కువ. దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఈ కారణంగా చాలామందిని ‘హర్ట్' చేశాను కూడా అంటోంది కలర్స్ స్వాతి. చెన్నయ్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే ..నేనేమీ హఠాత్తుగా హీరోయిన్ కాలేదు. యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ అయ్యాను. ఈ ప్రయాణంలో నాపై ఎన్నో రూమర్లు, మరెన్నో విమర్శలు వచ్చాయి. గాసిప్స్ ను అస్సలు పట్టించుకోను. అర్హత కలిగిన విమర్శలను మాత్రం గౌరవిస్తాను అంది. 

ఇక తనకి డబ్బు, పేరు నాకు ముఖ్యం కాదు. సంతోషమే ముఖ్యం అని చెప్పింది. తన మనస్సులోని కోరికలు చెపుతూ...ఏ విధమైన కట్టుబాట్లతో పనిలేకుండా జాలీగా జీవితం సాగించాలి. ప్రెండ్స్ తో హాయిగా ఊరు చుట్టిరాగలగాలి. ఒక సామాన్యమైన అమ్మాయిగా బ్రతకాలి. ఇదే నేను కోరుకునేది. ఏదో సాధించాలనే ఆశ కూడా నాకు లేదు. అందుకే ఆనందంగా ఉన్నానేమో అంది. ఇక ప్రస్తుతం కలర్స్ స్వాతికి పెద్దగా సినిమాలు తమిళంలోనూ లేవు. తెలుగులో కందిరీగ తర్వాత ఆఫర్లేమీ రాలేదు. ఆ మధ్య ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా అనుకున్నారు కానీ అది ముందుకు వెళ్లలేదు. అప్పలరాజు డిజాస్టర్ కావటంతో ఆమెను హీరోయిన్ గా తీసుకునే వారు సైతం కరువయ్యారు.