వివాదంలో చెర్రీ రచ్చ

వివాదంలో చెర్రీ రచ్చ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రచ్చ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. రచ్చ సినిమాలో అసభ్యకరమైన దృశ్యాలు ఉన్నాయని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌‍లో ఆదివారం కేసు నమోదైంది. రచ్చ సినిమాలో వానా వానా వెల్లువాయే చిత్రం ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే హీరో, హీరోయిన్ల రొమాన్స్ పాటలో గౌతమ బుద్దుని చూపించడాన్ని జాతీయ అరుంధతీ మహిళా శక్తి ఆక్షేపించింది. ఈ పాటలో అశ్లీల సన్నివేశాలు చిత్రీకరించారని వారి వెనుక గౌతమ బుద్దున్ని ఉంచారని ఇది సరికాదని వారు అంటున్నారు. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


చిత్ర దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ పైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గౌతమ బుద్దుని చైనా, థాయ్‌లాండుతో పాటు మన దేశంలోనూ భగవంతుడి వలె పూజిస్తారని అరుంధతి మహిళా శక్తి సభ్యులు చెప్పారు. అలాంటి పవిత్ర బుద్దుని ఎదుట అశ్లీలంగా డాన్స్ చేయడాన్ని తాము సెన్సార్ బోర్డు, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మానవ హక్కుల వేదిక దృష్టికి కూడా తీసుకు వెళతామని చెప్పారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న విషయం తెలిసిందే.