రాష్ట్ర ప్రజలపై కరెంట్ చార్జీల భారం

రాష్ట్ర ప్రజలపై కరెంట్ చార్జీల భారం

హైదరాబాద్: ఉగాది పండగ రోజున రాష్ట్ర ప్రజలపై కరెంట్ ఛార్జీలను భారీగా పెంచేందుకు కిరణ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 వేల కోట్ల రూపాయల వీరబాదుడుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరెంట్ ఛార్జీల పెంపు నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై మరింత భారం పడబొతోంది. 50 యూనిట్లు దాటితే వినియోగదారులపై మరింత భారం మోపనున్నారు. కరెంటు బిల్లుల్ని సకాలంలో కట్టకపోతే ఆలస్య రుసుము విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.