బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న దేవిశ్రీ

                                                   Devisri Prasad
దక్షిణాదిన మంచి పనితనం ఉన్న సంగీత దర్శకుడిగా, జోష్ ఉన్న పాటలు కంపోజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ త్వరలో బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ చిత్రాని దరువు వేసే అకాశం కోసం దేవిశ్రీ ఎదురు చూస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. తెలుగు మాటల రచయిత కోన వెంకట్ సల్మాన్ నటిస్తున్న ‘నో ఎంట్రీ 2' చిత్రానికి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు దేవిశ్రీకి అవకాశం ఇవ్వాలని రికమండ్ చేశాడట. 

గతంలో దేవిశ్రీ స్వర పరిచిన రింగరింగ ట్యూన్ ను తన ‘రెడీ' చిత్రంలో ధింకచిక ధింకచికా సాంగు కోసం వాడుకున్న సల్మాన్ ఖాన్ ఆసాంగ్ మంచి హిట్టయిన నేపథ్యంలో....దేవిశ్రీ ప్రసాద్ కు అవకాశం ఇచ్చే విషయమై సుముఖంగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే విషయం ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్', రామ్ చరణ్ తేజ్ ‘ఎవడు', నాగార్జున ‘ఢమరుకం', ప్రభాస్ ‘వారధి', బన్నీ-త్రివిక్రమ చిత్రాలకు ట్యూన్స్ కంపోజ్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తమిళంలో సూర్య హీరోగా రూపొందుతున్న సింగం-2 చిత్రానికి కూడా చాన్స్ దక్కించుకున్నాడు.