నోరు చెడు వాసన వస్తూంటే?

                                          Food To Cure Bad Breath

నోరు చెడు వాసన వస్తుంటే చాలా చికాకుగా వుంటుంది. వ్యక్తిగతంగాను, పక్కన వున్నవారికి కూడా అసహ్యమే. నోరు చెడు వాసన ఎందుకు వస్తుంది? అనేదానికి సరైన నోటి శుభ్రత లేదా జీర్ణ వ్యవస్ధ లేకుంటే అని సమాధానం చెప్పాలి. వాసనకు కారణం నోరు మాత్రమే కాదు. మీ జీర్ణ వ్యవస్ధ కూడా. తినే ఆహారం, బాక్టీరియా కారణాలు. నోరు వాసన రాకుండా వుండాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. 

విటమిన్ సి అధికంగా వుండే ఆహారాలు, నిమ్మ జాతి పండ్లుతినాలి. ఇవి బాక్టీరియాను అరికట్టి నోరు వాసన రాకుండా చేస్తాయి. విటమిన్ సి నోటి వ్యాధులు, చిగుళ్ళ వాపు వంటివి రాకుండా చేస్తుంది. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి సహజ నివారణనిస్తాయి. యాపిల్, కేరట్ కూడా నోటి వాసనకు బాగా పనిచేస్తాయి. ప్రతి భోజనం తర్వాత ఒక నిమ్మచెక్కను నాకేయండి. దంతాలు కూడా తోమవచ్చు. దీనిలోని సిట్రిక్ యాసిడ్ బాక్టీరియాను చంపేస్తుంది. నిమ్మ చెక్క లేకుంటే, ఉల్లిపాయ, అల్లం లేదా వెల్లుల్లి వంటివి చెడు వాసన అరికడతాయి. 

యాలకులు, లవంగాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు వాడి వాసన పోగొట్టుకోవచ్చు. ఇవి మౌత్ ఫ్రెషనర్స్ గా కూడా పని చేస్తాయి. తక్కువ కొవ్వు, షుగర్ లేని సహజమైన పెరుగు తినండి. ఇది నోటిలోని బాక్టీరియాను తొలగించి చెడు వాసన సహజంగా అరికడుతుంది.