మందు కొట్టిన హేంగోవర్ దిగాలంటే?

గత రాత్రి ఆల్కహాల్ అధికమైందా? మరుసటి రోజు ఉదయం పదిగంటలైనా హేంగోవర్ దిగటం లేదా? ఇక మరెప్పుడూ తాగరాదని అనుకుంటున్నారా? సాధారణంగా హేంగోవర్ దిగాలంటే పిల్స్ వేయడం, విశ్రాంతి పొందటం చేస్తారు. అయితే సహజ ఆహారాలతో హేంగోవర్ ఎలా అధిగమించాలో చూడండి. నిమ్మరసం, లేదా తగినంత నీరు తాగటం పరిస్ధితిలో మార్పు కనిపిస్తుంది. అయితే 4 సహజ ఆహారాలతో కూడా ఈ హేంగోవర్ తగ్గించుకోవచ్చు. 

పండ్లు - నిమ్మ, ఆరెంజస్, ద్రాక్ష తినండి. వీటిలో వుంటే విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో వున్న విష పదార్ధాలతో పోరాడతాయి. సరిగ్గా ఒక గంటలో హేంగోవర్ దిగిపోతుంది. అంతేకాదు, తలనొప్పి లేదా శక్తిహీనత వంటివి కూడా దరూరం చేస్తాయి. లేదా పండ్ల రసంతో పాటా సలాడ్ కూడా ఏదైనా తినండి.

పెరుగు మరియు తేనె - ఆల్కహాల్ ప్రభావం ఈ మిశ్రమం బాగా తగ్గిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చండి. తీపి పెరుగు తినకండి. లేదా వేడి పాలు తాగండి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు లోపల వున్న లిక్కర్ ప్రభావంతో పోరాడతాయి. 

బ్రెడ్ టోస్ట్ - ఆల్కహాల్ శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. కనుక బ్రెడ్ టోస్ట్ తినండి. ఇది ఆల్కహాల్ ను పీల్చేయటమే కాక, బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతుంది. అలసట లేకుండా చేస్తుంది. బేకన్ బ్రెడ్ శాండ్ విచ్ లో ఎమినో యాసిడ్లు అధికంగా వుండి బ్రెయిన్ కు తక్షణమో ఉపయోగపడతాయి. 

అల్లం - కొద్దిగా అల్లం తినేయండి. తక్షణం దాని ప్రభావం చూపి హేంగోవర్ దించేస్తుంది. లేదా తినే బ్రేక్ ఫాస్టులో వెల్లుల్లి తినండి. అది కూడా ప్రయోజనకారే. అన్నిటిని మించి నీరు బాగా తాగండి. ఆల్కహాల్ వలన ఏర్పడిన డీహైడ్రేషన్ పూర్తిగా తొలగిస్తుంది.