పూరిని ఫాలోకండి

పూరిని ఫాలోకండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్ సింగ్' ఆడియో ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి చెప్పినట్లు వింటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆడియో లైవ్ చూడొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పూరి జగన్నాథ్ యూట్యూబ్ ఛానల్ సబ్ స్ర్కైబ్ చేసుకుంటే ఇది సాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.

కాగా...గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ హైవేమీద కార్ జేజింగ్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్' రీమేక్. చిత్రాన్ని మే 9 న విడుదల చేసేందుకు నిర్మాత గణేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' అనే చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే.