పవన్ 'వన్ మ్యాన్ షో'గా మార్చేసారు

పవన్ 'వన్ మ్యాన్ షో'గా మార్చేసారు

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ..సల్మాన్ ఖాన్ చిత్రం దబాంగ్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని పూర్తిగా హరీష్ శంకర్ ..పవన్ వన్ మ్యాన్ షో గా మార్చేసాడని తెలుస్తోంది. కేవలం దబాంగ్ లోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్,స్టోరీ లైన్ మాత్రం తీసుకుని కొత్త స్క్రిప్టు రెడీ చేసి తెరకెక్కించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా పవన్ ఇంట్రడక్షన్ సీన్,క్లైమాక్స్ లు సినిమాకు హైలెట్ అవుతాయని అంటున్నారు. అవి రెండు కూడా దబాంగ్ లో లేనివని,స్వయంగా హరీష్ సమకూర్చినవని చెప్తున్నారు. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ...రీసెంట్ గా ఇరవై టాటా సుమాలు ఇన్వాల్స్ అయిన పెద్ద ఛేజ్ ని రీసెంట్ గా తీసారని తెలుస్తోంది. 

హీరో ఇంట్రడక్షన్ సీన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తిగా గుజరాత్ లో చిత్రీకరించారని,మగధీరలో రాజమౌళి హార్స్ రైడింగ్ సీన్స్ పండించిన చోటే ఈ సీన్స్ చిత్రీకరించాడని వినికిడి. చివరకు స్టోరీ నేరషన్,సాంగ్ లలో కూడా ఎక్కడా దబాంగ్ ని గుర్తుకు రాకుండా అంతా కొత్తగా చేసాడని,అవే హైలెట్ అవుతాయని,పవన్ ఇలా కొత్తగా చేసిన మార్పులకే ఆసక్తి చూపించాడని అంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో పవన్ ..రెక్లెస్ గా ఉండే పోలీస్ గా కనిపిస్తారు.