హీరో గోపీచంద్-హరిత పెళ్లి రద్దు

హీరో గోపీచంద్-హరిత పెళ్లి రద్దు

తెలుగు హీరో గోపీచంద్ వివాహం హరిత అనే అమ్మాయితో ఖరారైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఫిబ్రవరి 24న పెళ్లి జరుగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వివాహం రద్దయినట్లు తెలుస్తోంది. అసలు కారణాలు తెలియరాలేదు కానీ....పర్సనల్ ప్రాబ్లమ్సే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది. సినీ హీరో అయిన గోపీచంద్ కు...ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన హరితతో వివాహం ఫిక్స్ కావడంతో సంతోషంగా ఉన్న గోపీచంద్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ విషయంతో షాక్ అయ్యారు. గోపీచంద్ కు ఓ ప్రముఖ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని గతంలో వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం కూడా కారణం అయి ఉండవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్లో. 

ప్రస్తుతం గోపీచంద్ చేతిలో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ బాలాజీ రియల్ మీడియా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఉంది. తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భూపతి దర్శకత్వం వహిస్తాడు. నిర్మాత కొన్ని రోజు క్రితం చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గోపీచంద్ ఇమేజ్‌కు తగినట్టుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాల మేళవింపుతో ఈ చిత్ర కథాంశం వుంటుంది. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తుంది. నిర్మాణపరంగా భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తాం. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి మాటలు: యం. రత్నం, సంగీతం: తమన్, కెమెరా: శక్తి శరవణన్