సైబర్ నేరాల్లో ఇదే అతి పెద్ద దొంగతనం!

                                 Michael Jackson

లండన్: ప్రపంచపు పాస్ సంగీతానికి దేవుడుగా ప్రజల నుండి నీరాజనాలు అందుకున్న మైఖెల్ జాక్సన్ ఆల్బమ్‌లు దొంగతనానికి గురయ్యాయి. వీటిల్లో ఇంకా మార్కెట్లోకి విడుదల కాని 'విల్ ఐ యామ్' ఆల్బమ్ ఉండడం విశేషం. జాక్సన్‌కు సంబంధించిన ఆల్బమ్‌లు సోనీ మ్యూజిక్ వెబ్ సైట్ నుండి సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు ప్రముఖ పత్రిక 'డైలీ మెయిల్' పేర్కోంది. త్వరలో మార్కెట్లో విడుదలకానున్న 'విల్ ఐ యామ్' ఆల్బమ్‌ని దృష్టిలో పెట్టుకోని దొంగతనం జరిగిందని తెలిపింది.

సోనీ మ్యూజిక్ వెబ్ సైట్ నుండి దాదాపు యాభైవేల మ్యూజిక్ ఫైల్స్‌ని దొంగతనంగా కాపీ చేశారని, వీటి విలువ సుమారు 160 మిలియన్ పౌండ్లుగా పత్రిక వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన సైబర్ నేరాల్లో ఇదే అతి పెద్ద దొంగతనంగా అభివర్ణించింది. అంతేకాకుండా సోనీ కంపెనీలో ఈ ఏడాదిలో జరిగిన రెండవ దొంగతనమని తెలిపింది. 

ఐతే ఎంతమంది నేరగాళ్లు జాక్సన్ ఆల్బంలను డౌన్‌లోడ్ చేసుకున్నదీ వెల్లడించేందుకు కంపెనీ ప్రతి నిధులు నిరాకరించారు. ఏడు సంవత్సరాల పాటు జాక్సన్ గీతాల హక్కులను సోనీ 250 మిలియన్ పౌండ్లు చెల్లించి దక్కించుకుంది.