నల్లని మిరియం - చక్కటి ఆరోగ్యం!

నల్లని మిరియం - చక్కటి ఆరోగ్యం!

ఆమ్లెట్, పస్తా లేదా వెజిటబుల్ సూప్ మీరు తాగేది, తినేది ఏ ఆహారమైనప్పటికి నల్లని మిరియాలు వేస్తే రుచి మరింత పెరుగుతుంది. చాలామందికి తెలిసినదానికంటే కూడా నల్లని మిరియాల ప్రయోజనం ఎంతో ఎక్కువ. వంటలలోరుచికి, ఘాటుకు ఉపయోగించటమే కాదు, టేబుల్ పై పెట్టుకొని ఆహారాలలో అదనపు రుచికి చల్లుకొని కూడా తింటారు. 

కేరళలో చాలామంది తాము తాగే బ్లాక్ కాఫీలో కొద్దిపాటి మిరియం పొడి వేసుకుని తాగి ఆనందిస్తారు. దాని వాసన అంత బాగుంటుంది. మిరియం పొడి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. సుగంధ ద్రవ్యం గానే కాక రుచిని పెంచుతుంది. జీర్ణ రసాలను అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను అధికం చేస్తుంది. 

దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా వుంటాయి. పేగులలో వుండే హానికర బాక్టీరియాను నిర్మూలించి కడుపులోని పరిశుభ్రతను కాపాడుతుంది. కనుక, తాజా మిరియం పొడి మీ వంటకాలకు చేర్చి ఎంత బాగుంటుందనేది గమనించండి.