40 సినిమాలు వదులుకున్న భామ

40 సినిమాలు వదులుకున్న భామ

బరితెగింపు..అనే పదం మోడల్ పూనమ్ పాండే వ్యవహార శైలికి చక్కగా వర్తిస్తుంది. భారతీయ సంప్రదాయ జనాలతో ఛీ కొట్టించుకునే విధంగా ప్రవర్తిస్తున్న ఈవిడ చేస్తున్న ఘన కార్యాలు అన్నీఇన్నీ కావు. టీమిండియా కోసం బట్టలిప్పి నగ్నంగా కనిపిస్తా అని ప్రకటించడం దగ్గర నుంచి...దేశ ప్రధానికి బికినీతో వెల్ కం చెప్పడం వరకు ఇలా ఈవిడ గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. 

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పూనమ్ మాట్లాడుతూ...ఆశర్యకరమైన విషయం వెల్లడించింది. అమ్మడు ఇప్పటి వరకు దాదాపు 40 బాలీవుడ్ సినిమా ఆఫర్లను తిరస్కరించిందట. ఎదుకలా చేశావ్ అంటే....సాదా సీదాగా సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం ఉండదు. నేను బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నానంటే అదో పెద్ద సెన్షేషన్ కావాలి. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అంటోంది. 

మీ చేష్టల పట్ల తస్లీమా నస్రీన్, చిత్రాంగద సింగ్ లాంటి ప్రముఖులు మండి పడుతున్నారు. మీ స్పందన ఏమిటి? అని అడగ్గా...వాళ్లంతా పబ్లిసిటీ కోసం నా పేరు వాడుకుంటున్నారు. నా పేరును వాడుకుని పబ్లిసిటీ పెంచుకున్నందుకు వారు నాకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది అని కౌంటర్ ఇచ్చింది.