మైనింగ్ మాఫియాకు ఐపియస్ అధికారి బలి

భోపాల్: మైనింగ్ మాఫియాకు మధ్యప్రదేశ్‌లో గురువారం ఓ ఐపియస్ అధికారి బలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఐపియస్ అధికారి నరేంద్ర కుమార్‌ను మైనింగ్ మాఫియా హత్య చేసింది. మోరెనా జిల్లా బామోర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ నరేంద్ర కుమార్ అక్రమంగా కొట్టిన రాళ్లను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఆపడానికి ప్రయత్నించారు. ట్రాక్టర్‌ను డ్రైవర్ ఆపకుండా అతని మీదుగా తోలాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లభించలేదు.

నరేంద్ర కుమార్ 2009 బ్యాచ్ ఐఎఎస్ ఆఫీసర్. ఆయన ప్రొబెషన్ మీద ఉన్నారు. ఆయన భార్య మధురాణి తేవాటియా ఐఎఎస్ అధికారి. ఆమె కూడా మధ్యప్రదేశ్‌లోనే పనిచేస్తోంది. అయితే ఆమె మెటర్నటీ లీవ్‌పై ఢిల్లీలో ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.