రామ్ గోపాల్ వర్మకు కెవిపి షాక్: భేటీ రద్దు

రామ్ గోపాల్ వర్మకు కెవిపి షాక్: భేటీ రద్దు

హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు షాక్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మకు ఇచ్చిన అపాయిటంట్‌మెంటును రద్దు చేసుకున్నారు. రెడ్డిగారు పోయారు సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ కెవిపి రామచందర్ రావును కలవాలని అనుకున్నారు. సినిమా కోసం వస్తున్నానని వర్మ తనతో చెప్పలేదని, సినిమా కోసం వస్తున్నట్లు తెలిసి తర్వాత భేటీని రద్దు చేసుకున్నానని కెవిపి రామచందర్ రావు చెప్పారు. 

సినిమా కోసం వస్తున్నట్లు వర్మ తొలుత తనతో చెప్పలేదని, అందుకే అపాయింట్‌మెంట్ ఇచ్చానని, సినిమా కోసమని చెప్పాక అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసుకున్నానని ఆయన చెప్పారు. రామ్ గోపాల్ వర్మను తాను కలువబోనని ఆయన చెప్పారు. రెడ్డిగారు పోయారు సినిమా కోసం వర్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కూడా కలుసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతర పరిణామాలపై రెడ్డిగారు పోయారు అనే సినిమాను వర్మ తలపెట్టినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.