ఆ చిత్రంలో మహేష్‌ సిక్స్‌ ప్యాక్

ఆ చిత్రంలో మహేష్‌ సిక్స్‌ ప్యాక్

సునీల్ పూల రంగడు దెబ్బతో మళ్లీ ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ క్రేజ్ మొదలైంది. అందరు హీరోలు మళ్లీ తమ శరీరాలను శ్రమింప చేసి తెరపై కండలు చూపించి మార్కులు కొట్టాయాలి అనుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ సైతం చేరాడంటున్నారు. సుకుమార్ దర్సకత్వంలో చేయబోయే చిత్రంలో ఓ సీన్ లో మహేష్ చొక్కా విప్పి ఫైట్ చేస్తాడని,ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఆ ఫైట్ కోసం మహేష్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ట్రైనర్ సాయింతో శరీరాన్ని తీర్చుదిద్దుకుంటున్నాడని చెప్తున్నారు. దీనికి కారణం మహేష్‌ బాబు, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటే దానికి అంచనాలు భారీగా ఉండమే అంటున్నారు. 

ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ బారీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఏప్రిల్‌ రెండవ వారంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. 'దూకుడు' సినిమా సూపర్ హిట్ కావటంతో ఈ చిత్రనిర్మాణ సంస్థకు మహేష్ సినిమాతో మరో మారు మెగా హిట్ కొడతామనే నమ్మకంతో ఉంది. మరోవైపు హండ్రెడ్ పర్సెంట్‌ లవ్‌ హిట్‌ కావటంతో సుకుమార్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో మహేష్‌ బాబు సిక్స్‌ప్యాక్ కోసం శ్రమిస్తున్నాడని చెప్తున్నారు.. అదే సమయంలో ముఖం అందం చెడకుండా మహేష్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలిసారిగా మహేష్‌ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.