మనోజ్ ‘మిస్టర్ నూకయ్య' సి రిపోర్ట్

మనోజ్ ‘మిస్టర్ నూకయ్య' సి రిపోర్ట్

మంచు మనోజ్ హీరోగా ‘మిస్టర్ నూకయ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హోళి పండగాను పురస్కరించుకుని రేపు ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ‘ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది. మనోజ్ ఎలాంటి డూపు లేకుండా సాహసోపేతంగా చేసిన స్టంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డిఎస్ రావు నిర్మిస్తున్నారు. సనా ఖాన్, కృతి కర్భంధ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘‘నో క్యాప్షన్-ఓన్లీ యాక్షన్'' అన్న ఉప శీర్షికకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఆద్యంతం యాక్షన్, కామెడీతో నిండి ఉంటుంది. కథానుగుణంగా ఈ సినిమాకు ‘‘మిస్టర్ నూకయ్య'' అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. మనోజ్ ఇందులో 12 గెటప్స్ తో కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తాడు. రియల్ గా తను చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాలో ఓ హైలెట్ గా నిలుస్తాయి. అన్న విభాగాల నుంచి ది బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. నిర్మాత డి.ఎస్.రావు మేకింగ్ పరంగా ఎక్కడా తగ్గింది లేదు. ఆడియో సూపర్ హిట్ అయింది. సినిమా సైతం 2012లో ఉత్తమ కమర్షియల్ చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది'' అన్నారు.