రేడియో ఛానల్‌పై ఎంఎస్. కొడుకు గుస్సా

రేడియో ఛానల్‌పై ఎంఎస్. కొడుకు గుస్సా

రాజకీయ నాయకులు, సినిమా వాళ్ల వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ మీడియాలో పలు కార్య్రక్రమాలు ప్రసారం కావడం సర్వ సాధారణమే. అయితే వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎం.ఎస్. నారాయణ పుత్ర రత్నం మాత్రం తన తండ్రి వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఓ రేడియో ఛానల్ లో కామెడీ ఫోగ్రాం ప్రసారం కావడాన్ని తట్టుకోలేక పోతున్నాడట. ‘రావు గారు-కోటి గాడు' పేరుతో బిగ్ ఎఫ్ లో ఓ కార్యక్రమం ప్రసారం అవుతూ ఉంటుంది. ఇందులో రావుగారి కార్యరెక్టర్ ను ప్రముఖ నటుడు రావుగోపాల్ రావును ఇమిటేట్ చేస్తూ, కోటి గాడి క్యారెక్టర్ ను ఎంఎస్ నారాయణను ఇమిటేట్ చేస్తూ డిజైన్ చేశారు. 

ఇలా చేయడంపై ఎంఎస్ కొడుకు విక్రమ్ ఆ రేడియో ఛానల్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విక్రమ్ కు కోపం రావడానికి కారణం రావుగారి క్యారెక్టర్ ను ఇంటలిజెంట్ గా, కోటిగాడి క్యారెక్టర్ ను ఇన్నోసెంట్ అండ్ ఫూలిష్ గా చిత్రీకరించడమే.

విక్రమ్ గతంలో ‘కొడుకు', ‘భజంత్రీలు' చిత్రాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందక పోవడంతో విక్రమ్ కు వెండి తెరపై లైఫ్ లేకుండా పోయింది.