నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్

నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్

నాగచైతన్య, తను కలిసి త్వరలోనే కలిపి నటించనున్నామని నాగార్జున చెప్పారు. అలాగే తనలో గ్లామర్‌ ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తానని తెలిపారు. అలాగే రాబోయే చిత్రంలో షిరిడీ సాయిబాబా పాత్ర పోషించటం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. షిరిడీ సాయిబాబా సినిమాలో కూడా ‘అన్నమయ్య' సినిమా తరహాలోనే నియమ, నిష్టలతో నటించాలన్నది తన సంకల్పమని చెప్పారు. ఈ చిత్రానికి గుండుతో నటించటం చాలా అవసరం. అందుకే గ్లామర్‌ను పక్కన పెట్టేశాను అని అన్నారు. గ్లామర్ నన్ను వదిలేసే వరకు గ్లామర్ పాత్ర పోషిస్తాను. 

ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఆలోచించను అన్నారు. అలాగే బాబా సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్ద సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా. బాబా సినిమాకు స్ఫూర్తి బాబానే. ఆయనకంటే స్ఫూర్తి దాయకులు ఎవరు.. అన్నారు. రాఘవేంద్రరావు దర్శకుడుగా ఇది వరకు అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో నటించానని, తిరిగి షిర్డీ సాయిబాబా చిత్రంలో నటించే భాగ్యం కలిగిందని వివరించారు. ఈ చిత్రంలో నటించే ముందు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని వెళ్లానని చెప్పారు.